బిగ్ బాస్..ఏదో ప్లాన్ చేసారు గాని ఈసారి వర్కౌట్ అవ్వట్లేదా?

Published on Sep 17, 2021 12:33 pm IST


మన తెలుగు బిగ్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అని అందరికీ తెలిసిందే. మొత్తం నాలుగు సీజన్లని విజయవంతంగా కంప్లీట్ చేసుకొని రీసెంట్ గా ఐదవ సీజన్లో కి అడుగు పెట్టింది. అయితే గతంలో నాలుగు సీజన్లు స్లో స్టార్ట్ అయినా తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ దక్కింది కానీ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గా మేకర్స్ మొదటి నుంచే కంటెస్టెంట్స్ తో మంచి మసాలా నే ప్లాన్ చేసారు..

కానీ ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో వీక్షకులకి పెద్దగా ఎక్కుతున్నట్టు అనిపించడం లేదు. మోస్ట్లీ అయితే ఎవరికీ అంతగా ఎంటర్టైనింగ్ ఇవ్వడం లేదనే టాక్ ఉంది. మెల్లమెల్లగా మంచి టాస్కులు అన్నీ స్టార్ట్ చేస్తూ గతంలో లానే ఉంటే బాగుండేది అని అలాగే కంటెస్టెంట్స్ లో ఓవర్ పాలిటిక్స్ కూడా చూసే వాళ్లకి బోర్ కొట్టిస్తుంది. మరి ఇక ముందు నుంచి అయినా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :