బిగ్‌బాస్ 5: ఈ వారం ఆ ఒక్కరు మినహా అందరూ నామినేట్..!

Published on Nov 16, 2021 2:20 am IST


బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ అప్పుడే పదో వారం పూర్తి చేసుకుని పదకొండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత వర్మ, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వ ఎలిమినేట్ కావడం, అనారోగ్యం కారణంగా జెస్సీ బయటకు రావడంతో పదో వారం కాజల్ ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి తప్పుకుంది. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా జోరుగానే సాగింది. అయితే ఈ వారం షణ్ముక్, కాజల్, మానస్, సిరి, ప్రియాంక, సన్నీ, అనీ, శ్రీరామ చంద్ర నామినేట్ కాగా కేవలం కెప్టెన్ రవి మినహా మిగిలిన వారంతా నామినేషన్లో ఉన్నట్టు టాక్. చూడాలి మరీ ఈ 8 మందిలో ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు పోతారన్నాది.

సంబంధిత సమాచారం :