“బిగ్ బాస్ 5” ఫస్ట్ ఫన్ డే..ఎవరినీ వదలని నాగ్.!

Published on Sep 12, 2021 12:54 pm IST


మన తెలుగు బిగ్గెస్ట్ స్మాల్ స్క్రీన్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 5 లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజుతో వారం కంప్లీట్ చేసుకోనున్న ఈ గ్రాండ్ షో మరి ఈరోజు ఫస్ట్ సండే ఫన్ డే లోకి అడుగు పెట్టింది. నిన్న శనివారం తోనే నాగ్ మళ్ళీ స్టేజ్ మీదకి అడుగు పెట్టగా ఈరోజు మరింత ఎంటర్టైన్మెంట్ కి రంగం సిద్ధం అయ్యింది.

మరి లేటెస్ట్ ప్రోమోలో చూసుకుంటే నాగ్ మొత్తం 19 మంది హౌస్ మేట్స్ లో ఎవరినీ వదిలిపెట్టలేదని చెప్పాలి. ప్రతి ఒకరితో కూడా వారి జోడిలకు సంబంధించి వారి వారి విషయాలు బయట పెట్టే పనిలో పడ్డారు. ఇంకా చిత్ర విచిత్ర టాస్కులు, రాంప్ వాక్, డాన్సులు ఇలా ఈ సండే ఫన్ డే బాగానే ఉండేలా ఉంది. ఇక వీటన్నటి తర్వాత ఎలిమినేషన్ పై మాత్రం ఇంకా ఇందులో ఎలాంటి హింట్ ఇవ్వలేదు. మరి ఈ వీక్ ఎలిమినేషన్ ఎవడు అవుతారా అన్నది కూడా ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :