‘బిగ్ బాస్’ ఫస్ట్ వీకెండ్..షన్ను కి తన స్టైల్ లోనే నాగ్.!

Published on Sep 11, 2021 4:02 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యి రేపటితో వారం అయ్యిపోతుంది. మరి వీకెండ్ వచ్చింది అంటే హోస్ట్ కింగ్ నాగ్ రంగంలోకి దిగుతాడన్న సంగతి తెలిసిందే. మరి అలా ఈ వీకెండ్ శనివారం ఎపిసోడ్ కి నాగ్ వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్టుగా లేటెస్ట్ ప్రోమోతో అర్ధం అవుతుంది. మరి ఈ సీజన్లో ఫస్ట్ వీకెండ్ మస్తీ గా ఉన్నట్టు అనిపిస్తుంది.

అందరి కంటెస్టెంట్స్ తో నాగ్ ముచ్చట్లు.. లోబో కి అయితే ఈ సీజన్ ఎంటర్టైనర్ గా బిరుదు ఇచ్చేసారు. ఇక మరో కీలక కంటెస్టెంట్ గా ఉన్న షన్ను కి అయితే అది స్వీట్ వార్నింగ్ నో లేక స్వీట్ సజెషన్ అనుకోవాలో కానీ అతడిని ఇమిటేట్ చేస్తూ తన డైలాగ్ లోనే అరేయ్ ఏంట్రా ఇది అంటూ ఇంకెప్పుడు ఆడుతావ్ వారం అయ్యిందిరా అంటూ ఫన్ జెనరేట్ చేసారు. మొత్తానికి మాత్రం ఈ ఫస్ట్ వీకెండ్ ఫన్ ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ గా ఉండేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :