నెక్స్ట్ లెవెల్లో “బిగ్ బాస్ 5” గ్రాండ్ ఫినాలే.. ఊహించని గెస్టులతో రచ్చే

Published on Dec 19, 2021 2:00 pm IST

మన తెలుగు బుల్లితెర వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఈరోజు ఎంతో అట్టహాగంగా నెవర్ బిఫోర్ విజువల్స్ తో స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ కావడానికి రెడీగా ఉంది. మరి ఇప్పుడు ఈ గ్రాండ్ ఎపిసోడ్ కి సంబంధించిన నయా ప్రోమోని మేకర్స్ రివీల్ చేశారు.

మరి ఈ ప్రోమో మాత్రం ఈ మొత్తం ఈ ఫైనల్స్ కి తగ్గ రేంజ్ లోనే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ప్రామిసింగ్ హైప్ తో ఊహించని అతిథులతో అదిరే లెవెల్లో ఉంది. నిన్న జరిగినటువంటి బాలీవుడ్ బిగ్ మూవీ “బ్రహ్మాస్త్ర” యూనిట్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోయిన్ ఆలియా భట్ సహా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా బిగ్ బాస్ 5 స్టేజి ని గ్రేస్ చేశారు.

అంతే కాకుండా రాజమౌళి బిగ్ బాస్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ తో చిట్ చాట్ చెయ్యడం కూడా జరిగింది. మరి వీరే కాదు నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్ హీరోయిన్స్ సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు కూడా వచ్చి సందడి చెయ్యడంతో ఈ షోలో రచ్చ రచ్చే అయ్యింది.

ఇంకా శ్రేయ స్పెషల్ పెర్ఫామెన్స్, కంటెస్టెంట్స్ ఆనీ మాస్టర్ మరియు నటరాజ్ ల “RRR” నాటు నాటు పెర్ఫామెన్స్ లు రష్మికా మందన్నా డాన్స్ ఇలా అనేక హంగులతో ఈరోజు బిగ్ బాస్ ఫినాలే సందడి వేరే లెవెల్లో ఉండబోతుంది అని అర్ధం అవుతుంది. ఇక ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలి అంటే సాయంత్రం 6 గంటలకి స్టార్ మా లో ఈ ఎపిసోడ్ ని మిస్సవ్వకుండా చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :