టైటిల్‌ గెలవాలనే ఫైర్‌ తనలో ఎక్కువగా ఉంది – మానస్

Published on Dec 19, 2021 9:57 pm IST

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో చివరకు సన్నీ, శ్రీరామ్‌, మానస్‌, షణ్ముఖ్‌ టైటిల్‌ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఒకరిని ఎలిమినేట్‌ చేసేందుకు శ్యామ్‌ సింగరాయ్‌ టీమ్‌ నుంచి నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి హౌస్‌ లోకి వచ్చారు. చివరకు నాని మానస్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక మానస్‌ మాట్లాడుతూ.. ‘జర్నీ అద్భుతంగా ఉంది. హౌస్‌మేట్స్‌ హృదయాలను గెలుచుకున్నాను.

ముఖ్యంగా ఓపిక ఎక్కువ ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నాను. ఇక టైటిల్ గెలవాలని కసితో ఎవరి స్టైల్‌ లో వాళ్లు ప్రయత్నించాము. కానీ, మాలో టైటిల్‌ ఎవరు గెలిచిన మేమంతా ఏదో ఒకటి సాధించినట్టే. ఇక నాకు తెలిసి టైటిల్‌ గెలవాలనే ఫైర్‌ సన్నీలో ఎక్కువగా ఉంది. ఎలాగూ లాంగ్ జర్నీ చేశాడు కాబట్టి కచ్చితంగా అతనికి ప్రేక్షకుల మద్దతు ఉంటుంది. కాకపోతే ఎవరికి ఎక్కువ మందికి ఉంటే వారే విన్నర్‌’’ అని మానస్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :