బిగ్‌బాస్ 5: ఈ వీక్ ఆ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో?

Published on Oct 23, 2021 9:01 pm IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 ఏడో వారం ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, మొన్న వారం శ్వేత వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా, ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠని రేపుతుంది.

అయితే ఈ వారం నామినేషన్‌లలో అనీ మాస్టర్, లోబో, ప్రియ, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో ముఖ్యంగా అనీ మాస్టర్, ప్రియ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే నామినేషన్ జరిగిన రోజు ఈ వారం యానీ వెళ్లిపోవడం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. కానీ కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో ప్రియ, సన్నీ మధ్య పెద్ద ఫైట్‌ జరగడం, ప్రియ ప్రవర్తన చాలామందికి నచ్చకపోవడంతో ఆమెపై బాగా నెగిటివిటీ పెరిగింది. దీంతో ప్రియకు ఓటింగ్‌ శాతం తగ్గిందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే సన్నీ కెప్టెన్ అయ్యేందుకు ఆనీ మాస్టర్ సహకరించడంతో ఆమెపై కాస్త పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చిందని టాక్. అయితే కొందరు ఈ వారం యానీ బయటకు వెళ్తారని అంటుంటే, మెజారిటీ నెటిజన్లు ప్రియ ఎలిమినేట్‌ అవుతుందని అంటున్నారు. మరీ ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :