బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేషన్‌లోకి వచ్చింది వీరే..!

బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేషన్‌లోకి వచ్చింది వీరే..!

Published on Nov 30, 2021 2:37 AM IST


బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ పదమూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత వర్మ, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వ, పదో వారం జశ్వంత్, పదకొండో వారం యానీ మాస్టర్, రీసెంట్‌గా రవి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 7 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా జోరుగానే సాగింది. అయితే ఈ వారం ప్రియాంక, సిరి, మానస్, శ్రీరామ్‌, కాజల్‌లు నామినేషన్‌లోకి రాగా, కెప్టెన్‌ అయిన కారణంగా షణ్ముఖ్‌, ఎవరూ నామినేట్‌ చేయకపోవడంతో సన్నీ ఈ వారం నామినేషన్‌లోకి రాలేదు. మరీ నామినేట్ అయిన 5 మందిలో ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు పోతారన్నాది చూడాలి మరీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు