“బిగ్ బాస్ 6” : అప్పుడే ఈ డోస్ స్టార్ట్ చేసిన మేకర్స్..!

Published on Sep 6, 2022 9:00 am IST

రీసెంట్ గానే మళ్ళీ మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర సూపర్ హిట్ అయినటువంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. మొత్తంలో 5 సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకొని 6వ సీజన్లో కి అడుగు పెట్టింది. అయితే బిగ్ బాస్ మూడు సీజన్ల వరకు మంచి ఆసక్తిగా స్టార్ట్ అయ్యింది కానీ తర్వాత రెండు సీజన్లకు మాత్రం స్టార్టింగ్ అంత ఎంగేజింగ్ గా లేదని ఓ టాక్ అయితే వచ్చింది.

మరి దీన్ని ఈసారి సెట్ చేసుకున్నట్టే అనిపిస్తుందని చెప్పాలి. షో స్టార్ట్ అయ్యి వారం కూడా అవ్వకుండానే ఉన్న కంటెస్టెంట్స్ మధ్య మంచి డ్రామా స్టార్ట్ అయ్యింది ఎమోషనల్ గా వారి మధ్య గొడవల పరంగా కానీ అప్పుడే మంచి డోస్ తోనే స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. మరి ఈ తరహా లోనే చివరి వరకు ఉంటే సాలిడ్ టీఆర్పీ రేటింగ్ నమోదు కావడం ఖాయం అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే మంచి డ్రామానే హౌస్ లో కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :