“బిగ్ బాస్” తెలుగు..మళ్ళీ ఈ క్రెడిట్స్ రచ్చ.!

Published on Dec 31, 2021 8:00 am IST

గత కొన్ని రోజులు కితమే తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంప్లీట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నిన్న మళ్ళీ ఈ సీజన్ ఫినాలే కి ఎంత రేటింగ్ వచ్చేది అనేది మేకర్స్ రివీల్ చేశారు. మరి ఈసారి కూడా భారీ రేటింగ్ ని సీజన్ 5 కి వచ్చినట్టుగా స్టార్ మా వారు తెలియజేసారు.

మరి ఇక్కడే బిగ్ బాస్ వీక్షకుల్లో మళ్ళీ క్రెడిట్స్ రచ్చ స్టార్ట్ అయ్యింది. నిజానికి ఈ సారి సీజన్ గత సీజన్లో టీఆర్పీ ని టచ్ చెయ్యలేకపోయింది. దీనితో ఈ సీజన్ విన్నర్ సన్నీ ఫ్యాన్స్ కి మిగతా ఫైనలిస్ట్ ఫ్యాన్స్ కి నడుమ ఈ రేటింగ్ గోల వైరల్ కాగా లాస్ట్ సీజన్ కి జరిగిన మాటలు కూడా మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గత సీజన్ కి గాను అభిజీత్ విన్నింగ్ మూమెంట్ చూడడం వల్లే ఆల్ టైం రికార్డ్ టీఆర్పీ వచ్చిందని కొంతమంది వాదన అయితే ఈసారి సన్నీ విషయంలో అలాంటి మ్యాజిక్ జరగలేదు అని ఇతర కంటెస్టెంట్స్ అభిమానుల వాదన. అంటే ఈ సారి తక్కువ వచ్చిన రేటింగ్ కి గాను సన్నీ క్రేజ్ ఇంతేనా అన్నట్టు వారి నడుమ టాక్ నడుస్తుంది.

ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ రేటింగ్ అనేది విన్నింగ్ కంటెస్టెంట్ ఒక్కడిపై డిసైడ్ అయ్యి ఉండేది కాదు ఈ ఎపిసోడ్ లో ప్రతి ఎలిమెంట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని వారంతా ఎప్పుడు అర్ధం చేసుకుంటారో మరి.

సంబంధిత సమాచారం :