బిగ్‌బాస్ 5: ఈ వారం శ్వేత ఎలిమినేట్ కాబోతుందా?

Published on Oct 17, 2021 3:00 am IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 అప్పుడే ఐదో వారంలోకి ఎంటర్ అయ్యింది. అయితే ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది సభ్యులు ఉండగా వారిలో ఈ వారం జ‌రిగిన నామినేష‌న్స్‌లో శ్రీరామ్ చంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేతా, సన్నీ ఉన్నారు.

అయితే వీరిలో లోబో, విశ్వ‌, శ్వేత డేంజ‌ర్ జోన్‌లో ఉండగా ఈ ముగ్గురిలో శ్వేత ఎలిమినేట్ అయిన‌ట్లు లీకులు వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజైన ప్రోమోలో శ్వేత, లోబోల‌లో ఒక‌రిని ఎలిమినేట్ చేస్తున్న‌ట్లు చెప్పాడు. అయితే ఎలిమినేట్ చేసిన‌ట్లే చేసి లోబోను సీక్రెట్ రూమ్‌కు పంపించారట. అంతేకాదు సీక్రెట్ రూమ్‌ కారణంగా లోబో సేఫ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తానికి ఈ వారం శ్వేత ఎలిమినేట్ అయే ఛాన్సే ఎక్కువగా ఉంది.

సంబంధిత సమాచారం :

More