బిగ్‌బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యింది ఆమెనేనా?

Published on Oct 10, 2021 2:11 am IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 అప్పుడే ఐదో వారంలోకి ఎంటర్ అయ్యింది. అయితే ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో 15 మంది సభ్యులు ఉండగా వారిలో ఈ వారం యాంకర్‌ రవి, షణ్ముఖ్‌ జశ్వంత్‌, మానస్‌, హమీదా, విశ్వ, జెస్సీ, సన్నీ, లోబో, ప్రియ నామినేషన్ అయ్యారు. వీరిలో విశ్వ, జెస్సీ, సన్నీ డేంజర్‌ జోన్‌లో ఉండగా ముగ్గురిలో ఐదోవారం హమీదాపై ఎలిమినేషన్‌ వేటు పడినట్లు లీకులు వినిపిస్తున్నాయి.

అయితే హమీదా ఏ విషయానైనా సూటిగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి. కానీ ఆమె హౌస్‌లో ఎక్కువగా శ్రీరామ చంద్రతోనే ఉండడం, ప్రతి విషయానికి అతడిపైనే ఆధారపడుతుందన్న విమర్శలు వినిపించాయి. బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్‌ అవ్వాలని హమీదా కలలు కనగా అది తీరకుండానే ఆమె హౌస్ నుంచి వెళ్ళిపోయిందని నెటిజన్లు చెవులు కొరుకుంటున్నట్టు తెలుస్తుంది. మరీ ఈ వారం హమీదా నిజంగానే హౌస్‌నుంచి వెళ్లిపోతుందా? లేదా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :