పోలీసుల అదుపులో బిగ్ బాస్ విన్నర్ తో సహా పలువురు సినీ ప్రముఖులు…ఏం జరిగిందంటే?

Published on Apr 3, 2022 12:01 pm IST

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ఓ ప్రముఖ హోటల్ లో యాజమాన్యం రేవ్ పార్టీ ను నిర్వహించడం జరిగింది. అయితే సమయానికి మించి హోటల్ ను నడపడం మాత్రమే కాకుండా, రేవ్ పార్టీ ను నిర్వహించడం తో పోలీసులు ఆకస్మిక దాడి చేయడం జరిగింది. తెల్లవారుఝామున ఉదయం 2:30 గంటల సమయం లో దాడి జరగగా, పోలీసులు 150 మందికి పైగా అదుపులోకి తీసుకోవడం జరిగింది.

ఆ పార్టీ లో యువతీ యువకులతో పాటుగా, టాలివుడ్ ప్రముఖ గాయకుడు, బిగ్ బాస్ విన్నర్ తో పాటుగా సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు ఉండటం విశేషం. ఈ పార్టీ లో డ్రగ్స్ తో పాటుగా కొన్ని మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గా అదుపులో ఉన్న యువతీ యువకుల నుండి పూర్తి విషయాలను తెలుసుకుంటున్నారు పోలీసులు. సమయానికి మించి హోటల్ ను నడపడం, రేవ్ పార్టీ నిర్వహించడం పలు కారణాల తో యాజమాన్యం పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం :