బిగ్‌బాస్: ఈ వారం మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్?

Published on Nov 27, 2021 1:57 am IST


బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత వర్మ, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వ, పదో వారం జశ్వంత్, పదకొండో వారం యానీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అయితే ఈ ఎనిమిది మందిలో ఈ వారం ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. మానస్‌ మినహా కాజల్‌, సిరి, రవి, షణ్ముఖ్‌, సన్నీ, ప్రియాంక సింగ్‌, శ్రీరామచంద్ర నామినేట్‌ అయ్యారు. దీంతో ఈ ఏడుగురిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే అనఫీషియల్‌ ఓటింగ్‌లో షణ్ముఖ్‌, సన్నీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారని, మూడు, నాలుగు స్థానాల కోసం యాంకర్‌ రవి, సింగర్‌ శ్రీరామ్‌ పోటీపడుతున్నారని టాక్ నడుస్తుంది. కాగా మొదటి నాలుగు స్థానాల్లో నలుగురు అబ్బాయిలే ఉండడంతో మిగిలిన ముగ్గురు అమ్మాయిల్లో ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈ ప్రకారం చూసుకుంటే కాజల్, సిరి కన్నా కూడా ప్రియాంక సింగ్(పింకీ)కి చాలా తక్కువ ఓట్లు వస్తున్నాయని, ఈ వారం పింకీనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అలికిడి వినబడుతుంది. అయితే సేఫ్ జోన్‌లో ఉన్న మానస్‌కి, పింకీకి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుండడంతో, పింకీని కనుక సేఫ్ చేయాలని అనుకుంటే మాత్రం కాజల్, సిరీలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :