బిగ్‌బాస్ ఫేమ్ సోహేల్ నూతన చిత్రం ప్రారంభం..!

బిగ్‌బాస్ ఫేమ్ సోహేల్ నూతన చిత్రం ప్రారంభం..!

Published on Feb 6, 2022 2:00 AM IST

మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో యువ కథానాయకుడు, బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా కాకతీయ ఇన్నోవేటివ్స్ & దొండపాటి సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న మొదటి చిత్రం పూజ కార్యక్రమం యాదాద్రిలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సోహేల్, నిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సినిమా కంటెంట్ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని, దర్శకులే నిర్మాతలైతే కంటెంట్ పై ఏంత కసరత్తు జరుగుతుందనేది నిదర్శనమే ఈ కాన్సెప్ట్. హైదరాబాద్‌లో జరిగే షూటింగ్ షెడ్యూల్లో ఈ చిత్రనికి సంబంధించి మిగతా వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు