బిగ్‌బాస్ 5: వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆ బ్యూటీ ఒకే అయినట్టేనా?

Published on Oct 6, 2021 2:02 am IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 అప్పుడే ఐదో వారంలోకి ఎంటర్ అయ్యింది. అయితే ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో 15 మంది సభ్యులు ఉన్నారు.

అయితే ఇప్పటివరకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతున్న హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా యాంకర్‌ విష్ణు ప్రియను పంపిస్తున్నారన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. అయితే ఇప్పటికే ఈ బ్యూటీతో మాట్లాడి, రెమ్యూషనరేషన్ సెట్ కూడా చేశాడట. 5వ లేదా 6వ వీక్‌లో ఓ టాస్క్‌లో భాగంగా హౌస్‌ లోకి విష్ణు ప్రియను పమపబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :