లేటెస్ట్..”యానిమల్” నుంచి బిగ్గెస్ట్ ట్రీట్ లోడింగ్.!

Published on Jun 10, 2023 1:34 pm IST

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా చిత్రం “యానిమల్” కూడా ఒకటి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ చేసిన నాటి నుంచే మాసివ్ హైప్ నెలకొనగా ఇపుడు ఈ చిత్రం రిలీజ్ విషయంలో కొన్ని రూమర్స్ వస్తుండగా మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇక ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రం నుంచి అయితే రేపు మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ ని అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో యానిమల్ నుంచి అయితే ఓ పెద్ద ట్రీట్ నే ఆడియెన్స్ కి రావచ్చని టాక్. అయితే ఇది సినిమా నుంచి టీజర్ కూడా కావచ్చని క్రేజీ బజ్ వినిపిస్తుంది. దీనితో అయితే మరోసారి బాలీవుడ్ మార్కెట్ లో బిగ్ థింగ్ గా ఈ చిత్రం నిలుస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇక రేపు టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :