‘బిగిల్’ ఫేమ్ యంగ్ హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ హ్యాక్.!

Published on Feb 2, 2022 10:00 am IST


ఇటీవల కాలంలో పలువురు సినీ తారల సోషల్ మీడియా అకౌంట్ లు హ్యాక్ అవుతున్నాయి అనే వార్తలు వింటూనే ఉన్నాము. ఆ మధ్య స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నుంచి సీనియర్ నటి ఖుష్బూ ఇలా చాలా మంది నటులే తమ హ్యాకర్స్ బారిన పడ్డారు. ఇక ఇప్పుడు తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అయ్యినటువంటి అమ్రిత అయ్యర్ కూడా బాధితురాలు అయ్యినట్టు కన్ఫర్మ్ చేసింది.

కోలీవుడ్ స్టార్ హీరో థలపతి విజయ్ నటించిన “బిగిల్” సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ యంగ్ హీరోయిన్ తెలుగులో కూడా పలు అవకాశాలు హీరోయిన్ గా దక్కించుకొని దూసుకెళ్తుంది. మరి లేటెస్ట్ గా ఈమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఇది నిజమే అని తన ట్విట్టర్ ద్వారా ఈమె కన్ఫర్మ్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఆమె అకౌంట్ నుంచి ఎలాంటి అవాంఛనీయ పోస్టులు పడనట్టే తెలుస్తుంది. మరి ఈ అకౌంట్ మళ్ళీ తిరియు తనకు రావాలని కోరుకుంటున్నట్టుగా ఈమె తెలుపుతుంది.

సంబంధిత సమాచారం :