చెన్నై సిటీలో బిగిల్ మూవీ వసూళ్ళలో సత్తా చాటింది. విజయ్-అట్లీ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం బిగిల్ మొదటి రోజు చెన్నై 1.79 కోట్ల వసూళ్లు సాధించి ఈ ఏడాదికి హైయెస్ట్ గ్రాస్సర్ గా నిలిచింది. ఓవర్ ఆల్ గా చెన్నై సిటీలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలుగా రజిని కాంత్ 2.0, సర్కార్ చిత్రాలు ఉండగా వాటి తరువాత బిగిల్ నిలిచింది. మెస్సేజ్ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బిగిల్ మూవీ సాలిడ్ కలెక్షన్స్ సాధించడం ఖాయం గా కనిపిస్తుంది.
తెలుగులో విజిల్ గా విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి మరో తమిళ చిత్రం ఖైదీ మినహా పోటీలేని నేపథ్యంలో పండుగ కలెక్షన్స్ బాగా రాబట్టే అవకాశం కలదు. ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ కి జంటగా నయనతార నటించగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
