అక్కడ “బిల్లా” రీ రిలీజ్ సెన్సేషన్!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో, దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ బిల్లా (Billa). ఈ చిత్రం 2007 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే నేడు హీరో అజిత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ను పలు ప్రాంతాల్లో రీ రిలీజ్ చేయడం జరిగింది. కర్ణాటక ప్రాంతం లో ఈ చిత్రం సెన్సేషన్ సృష్టిస్తోంది.

మార్నింగ్ షోస్ తో కలిపి ప్రీ సేల్స్ తోనే 5.48 లక్షల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. నాన్ కన్నడ రీ రిలీజ్ కి ఇదే అత్యధికం. ఈ నంబర్స్ తో అజిత్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించారు. ప్రభు, రహ్మాన్, నయనతార, నమిత కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.

Exit mobile version