యూట్యూబ్ లో దూసుకెళ్తున్న ‘బింబిసార’ ట్రైలర్….!!

యూట్యూబ్ లో దూసుకెళ్తున్న ‘బింబిసార’ ట్రైలర్….!!

Published on Jul 5, 2022 7:00 PM IST

కళ్యాణ్ రామ్ నందమూరి తాజా సినిమా బింబిసార. యువ దర్శకుడు వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ ఎంతో భారీ వ్యయంతో అత్యున్నత స్థాయిలో నిర్మించిన ఈ మూవీలో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసారుడి పాత్ర చేస్తున్నారు కళ్యాణ్ రామ్. ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ తరువాత నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. ఎంతో థ్రిల్లింగ్ గా యాక్షన్ అంశాలతో సూపర్ గా రూపొందిన ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అదిరిపోయిందని కితాబిస్తున్నారు.

మరోవైపు బింబిసార ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో 12 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని ఇంకా టాప్ స్థానంలోనే కొనసాగుతుండడం విశేషం. తమ మూవీ ట్రైలర్ కి ఇంత భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఆగష్టు 5న రిలీజ్ కానున్న మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ అభిప్రాయపడుతోంది. క్యాథరీన్ థ్రెసా, వారినా హుస్సేన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు