స్టాండర్డ్ గా “బింబిసార” వసూళ్లు..5 రోజుల కలెక్షన్స్ ఇవే.!

Published on Aug 10, 2022 11:03 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరిన్ మరియు భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “బింబిసార”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ లో అత్యవసరంగా కావాల్సిన భారీ హిట్ గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి సాలిడ్ వసూళ్లతో లాభాలను అందిస్తుంది. మరి లేటెస్ట్ గానే మొన్న సోమవారం వర్కింగ్ డే కి కూడా మంచి వసూళ్లను అందుకున్న ఈ చిత్రం నెక్స్ట్ డే కూడా స్టాండర్డ్ వసూళ్లతో హవా కొనసాగిస్తోంది. మరి ఈ ఐదు రోజుల్లో ఈ చిత్రం వసూళ్లు చూసినట్టు అయితే..

నైజాం – 89 లక్షలు (జి ఎస్ టి తో) (నైజాంలో 3 షోలు మాత్రమే)
వైజాగ్ – 37 లక్షలు (జి ఎస్ టి తో)
సీడెడ్ – 62 లక్షలు
కృష్ణ – 13.2 లక్షలు
గుంటూరు – 17 లక్షలు
నెల్లూరు – 6 లక్షలు
తూర్పు గోదావరి – 15 లక్షలు
పశ్చిమ గోదావరి – 11 లక్షలు

మరి ఈ 5వ రోజు 2.44 కోట్ల షేర్ ని రాబట్టగా ఈ ఐదు రోజుల్లో ఈ చిత్రం 20 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాల వారు తెలుపుతున్నారు. మరి ఈ చిత్రానికి 13 కోట్లు బిజినెస్ ఏపీ తెలంగాణలో జరగ్గా ఇపుడు ఈ చిత్రం భారీ లాభాలతో దూసుకెళ్తుంది.

సంబంధిత సమాచారం :