గ్రాండ్ సక్సెస్‌ తో దూసుకుపోతున్న ‘బింబిసార’ !

గ్రాండ్ సక్సెస్‌ తో దూసుకుపోతున్న ‘బింబిసార’ !

Published on Aug 8, 2022 10:31 AM IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా చారిత్రక కథాంశంతో వచ్చిన ‘బింబిసార’ గ్రాండ్ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు. విడుదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌ఏలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు. ఇప్పటివరకు, యూఎస్ బాక్సాఫీస్ వద్ద $300K వసూలు చేసింది. సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతుండటంతో ఈ చిత్రానికి మరికొన్ని స్క్రీన్లు కూడా యాడ్ చేశారు.

కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తివంతమైన పాత్రలో కనిపించారు. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటించారు. మొత్తానికి ‘బింబిసార’ హిట్ కావడంతో.. ఇప్పుడు బింబిసార 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. అయితే, తన బింబిసార చిత్రాన్ని హిట్ చేసిన ప్రేక్షకులకు కళ్యాణ్ రామ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు