సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ “బింబిసార”

Published on Aug 2, 2022 7:30 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ డ్రామా బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై హారి కృష్ణ కే నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించగా, చిరంతన్ భట్ సంగీతం అందించడం జరిగింది. ఈ చిత్రం లో కేథరిన్ థెరిస్సా, సంయుక్త మీనన్, వరీన హుస్సేన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ను ఈ నెల 5 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యూ/ఎ ను పొందడం జరిగింది. ఈ చిత్రం రన్ టైమ్ 2 గంటల 26 నిమిషాలు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :