ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన కల్యాణ్‌ రామ్‌ ‘బింబిసార’ !

Published on Oct 2, 2022 6:29 pm IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబట్టి సూపర్ హిట్ అయ్యింది. ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో కూడా అలరించడానికి రెడీ అయింది, ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ‘జీ-5’ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా అక్టోబర్‌ 7 నుంచి ‘జీ-5’ లో స్ట్రీమింగ్‌ కాబోతుంది.

మొత్తానికి బింబిసార చిత్రం థియేటర్స్ లో డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. క‌ల్యాణ్ రామ్ కత్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు.. అలాగే బింబిసార లోని బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద బింబిసార‌ తన ఏక ఛాత్రాధిప‌త్యాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించాడు. మరి ఓటీటీ లో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :