అదరగొడుతున్న “బింబిసార”.. కీలక టెస్ట్ లో కూడా స్ట్రాంగ్ వసూళ్లు.!

Published on Aug 9, 2022 11:44 am IST


లేటెస్ట్ గా టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక్క సూపర్ హిట్ రెండు సినిమాల రూపంలో ఒకే రోజు బయటకి వచ్చింది. మరి వాటిలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ హిట్ చిత్రం “బింబిసార” కూడా ఒకటి. మరి మొదటి రోజే సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే లాభాలు చూడడం స్టార్ట్ చేసింది.

అయితే మొదటి మూడు రోజుల్లో అదరగొట్టిన బింబిసార కీలకమైన సోమవారం టెస్ట్ ని ఎంతమేర సక్సెస్ ఫుల్ గా దాటగలదు అని ట్రేడ్ వర్గాల వారు ఆసక్తిగా చూడగా ఈ చిత్రం అదిరే వసూళ్లను రాబట్టి ఈ టెస్ట్ ను పాస్ అయ్యిపోయింది. మరి ఈ చిత్రం నాల్గవ రోజు 2.24 కోట్లు షేర్ రాబట్టింది. దీంతో ఇప్పటివరకు 18.2 కోట్లు షేర్ ని అందుకుంది. ఇది మరింత స్థాయిలో కొనసాగుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :