“బింబిసార” రెండో ట్రైలర్ కి కూడా మాసివ్ రెస్పాన్స్..!

Published on Jul 28, 2022 7:04 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పలు చిత్రాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరిన్ అలాగే సంయుక్త మీనన్ తదితరులు మెయిన్ లీడ్ లో నటించిన భారీ బడ్జెట్ చిత్రం “బింబిసార” కూడా ఒకటి. యంగ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ భారీ చిత్రం అదిరే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. మరి మేకర్స్ అయితే ఈ సినిమాపై మరింత స్థాయిలో హైప్ ని పెంచే పనిలో ఉండగా నిన్ననే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత రెండో ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

అయితే దీనికి మాత్రం రిలీజ్ అయ్యిన నిమిషాల్లోనే మాసివ్ రెస్పాన్స్ తో స్టార్ట్ అయ్యింది. అలా ఇప్పటికే భారీ రెస్పాన్స్ నే ఈ ట్రైలర్ అందుకుంది. మరి ఈ ట్రైలర్ కి 13 గంటల్లో ఏకంగా 78 లక్షల వ్యూస్ వచ్చేసాయి. దీనితో టైర్ హీరోస్ లో ఇది మరో సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఇక మొత్తానికి అయితే ట్రైలర్ వంతు అయ్యింది రేపు జరిగే ప్రీ రిలీజ్ తో సినిమాపై అంచనాలు ఎక్కడికి వెళ్తాయో చూడాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :