యూఎస్ లో “బింబి” విధ్వంసం..సూపర్ స్ట్రాంగ్ వసూళ్లు.!

Published on Aug 7, 2022 9:00 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట కాంబోలో వచ్చిన లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం “బింబిసార” కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ అండ్ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఐఐటీ ట్రేడ్ వర్గాలు ఆశించిన సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటూ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది.

మరి తెలుగు రాష్ట్రాల్లో సహా ప్రపంచ వ్యాప్తంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా అదరగొడుతుంది. అక్కడ లేటెస్ట్ గా ఈ చిత్రం 2 లక్షల 50 వేల డాలర్స్ వసూళ్లను క్రాస్ చేసేసి సూపర్ స్ట్రాంగ్ గా నిలబడుతుంది.

అంతే కాకుండా అదనపు స్క్రీన్స్ ని కూడా సొంతం చేసుకుంటూ బింబి మరింత విధ్వంసం నమోదు చేస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి అయితే ఈ వారపు రెండు సినిమాలు కూడా మంచి రన్ తో అయితే ముగుస్తాయని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :