నైజాం లో “బింబిసార” సెన్సేషన్..2 రోజుల్లో ఆల్మోస్ట్ కొట్టేసింది.!

Published on Aug 7, 2022 11:00 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “బింబిసార”. తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా వచ్చి తన కెరీర్ లో ఇపుడు బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా మారుతుంది. మొదటి రోజే తన కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుకున్న ఈ చిత్రం రెండో రోజుకి గాను చాలా ఏరియాల్లో ఆల్ మోస్ట్ సెట్ చేసుకున్న టార్గెట్ కి రీచ్ అయ్యిపోతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక లేటెస్ట్ గా అయితే నైజాం లో బింబిసార సెన్సేషన్ ని నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి నైజాం లో అయితే ఈ చిత్రం రెండో రోజు జి ఎస్ టి తో కలిపి 1.77 కోట్లు షేర్ రాబట్టగా రెండు రోజులకి గాను 3.87 కోట్లు మార్క్ కి చేరుకుంది. ఇక ఈ చిత్రానికి అక్కడ 4 కోట్లు బిజినెస్ జరగ్గా ఇది కేవలం రెండు రోజుల్లోనే ఆల్ మోస్ట్ కొట్టేసింది అని చెప్పాలి. ఇక ఈ ఆదివారం వసూళ్లతో అయితే బింబిసార భారీ లాభాలు ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :