‘బింబిసార’ ట్రైలర్… కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం !

Published on Jul 4, 2022 5:09 pm IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ఓ చారిత్రక కథాంశంతో రాబోతున్న సినిమా ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లోని విజువల్స్, యాక్షన్ మరియు ఎలివేషన్ షాట్స్ చాలా బాగున్నాయి. ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న అంటే.. మహా చక్రవర్తి బింబిసార ఏలిన రాజ్యానికి’ అంటూ మొదలైన ఈ ట్రైలర్ లో భారీ యాక్షన్ విజువల్స్ తో పాటు కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం ఆకట్టుకుంది.

డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ‘రాక్షసులు ఎరుగని రావణ రూపం, శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం అంటూ బింబిసార విశ్వరూపాన్ని ఈ ట్రైలర్ లో బాగా ఎలివేట్ చేశారు. బింబిసారుడు అంటేనే మరణశాసనం అనేలా సాగింది ఈ ట్రైలర్. ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ‘బింబిసార’ లుక్ లో కళ్యాణ్ రామ్ వైలెంట్ గా కనిపించాడు. ఇది కళ్యాణ్ రామ్ నెత్తుటి సంతకం అన్నట్టు ఉంది ట్రైలర్.

కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా.. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :