బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్న ‘బింబిసార’ ట్రైలర్ ….!!

Published on Jul 9, 2022 11:30 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రస్తుతం విపరీతంగా వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళుతోంది. మల్లిడి వశిష్ట్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడి పాత్ర చేస్తున్నారు కళ్యాణ్ రామ్. ఫస్ట్ లుక్ టీజర్ తో బాగా అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ తరువాత ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకి అందరిలో హైప్ పెంచేసింది.

ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ఏకంగా 20 మిలియన్ వ్యూస్ తో పాటు 460కె లైక్స్ సొంతం చేసుకుని ఇంకా ట్రేండింగ్ లోనే కొనసాగుతోంది. ముఖ్యంగా అదిరిపోయే విజువల్స్, గ్రాఫిక్స్, భారీ యాక్షన్ సన్నివేశాలతో మైమరపించిన బింబిసార ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ తన యాక్టింగ్, డైలాగ్స్ తో అదరగొట్టారు. క్యాథరీన్ థ్రెసా, సంయుక్తా మీనన్, వరీనా హుస్సేన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఆగష్టు 5 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది బింబిసార మూవీలో చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :