‘బింబిసార’ హిందీ వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ లాక్

Published on Jun 10, 2023 3:01 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన టైం ట్రావెల్ సోషియో ఫాంటసీ మూవీ బింబిసార. గత ఏడాది మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ సినిమాని నిర్మించగా క్యాథరీన్, సంయుక్తా హీరోయిన్స్ గా నటించారు. అటు ఓటిటి లో కూడా అందరి నుండి మంచి స్పందన అందుకుంది ఈ మూవీ.

అయితే ఏమిటంటే, ఈ సోషియో ఫాంటసీ డ్రామా హిందీ వెర్షన్ జూన్ 25న జీ సినిమాలో రాత్రి 8 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ గా ప్రదర్శితం కానుంది. నిజానికి ఈ విధంగా డబ్బింగ్ వెర్షన్ల ద్వారా తెలుగు నటీనటులకు ఉత్తరాదిలో మంచి గుర్తింపు వస్తోంది. ఈ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌పై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. మరి ఈ సీక్వెల్ ను తెరకెక్కించిన అనంతరం ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తారేమో చూడాలి. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేసిన బింబిసార హిందీ వర్షన్ బుల్లితెర ఆడియన్స్ ని ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :