‘ఆడపులి’గా బిందు మాధవి.. మరో భారీ ఆఫర్ ?

Published on May 29, 2022 8:30 pm IST

‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షోలో బిందు మాధవి విన్నర్ గా నిలవడం ఆమెకు బాగా కలిసొచ్చింది. ఒక్కసారిగా బిందు మాధవి సినీ జీవితం మారిపోయింది. ప్రస్తుతం ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే, అనిల్ రావిపూడి – బాలయ్య బాబు సినిమాలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ఓ కీలక పాత్రలో నటించబోతుంది. ఆమెది, బాలయ్యకి కూతురు పాత్ర అని టాక్ నడుస్తోంది.

ఇప్పుడు తాజాగా బిందు మాధవికి మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ఆఫర్ కూడా వచ్చింది అని తెలుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండబోతుందట. పైగా ఈ సినిమా టైటిల్ ‘ఆడపులి’ అని ప్రచారం జరుగుతుంది. ఎలాగూ బిగ్ బాస్ షో ద్వారా ఆడపులిగా బిందు మాధవికి పవర్ ఫుల్ ఇమేజ్ వచ్చింది. కాబట్టి.. ఈ టైటిల్ ఆమెకు ప్లస్ కానుంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :