మార్వెల్ స్టూడియోస్ బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ కి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్

మార్వెల్ స్టూడియోస్ బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ కి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్

Published on Nov 12, 2022 5:40 PM IST


ఈ ఏడాది వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ఒకటైన బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ మూవీ నిన్న భారీ స్థాయిలో రిలీజ్ అయి విమర్శకుల నుండి ప్రశంసలు అలానే ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అద్భుతమైన ప్రేక్షకుల స్పందనతో ఈ మూవీ తొలి రోజున ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.15.05 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ కలక్షన్ దక్కించుకుంది. ఇక వీకెండ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి కలక్షన్స్ క్రమంగా పెరుగుతూ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అన్ని ఏరియాల్లో మరింతగా దూసుకుపోతోంది.

ఇక ఇప్పటికే బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ మూవీకి బెస్ట్ MCU ఫిల్మ్ ఆఫ్ ఫేజ్ 4, సినిమా వి డిజర్వ్ మరియు స్పెక్టాక్యులర్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎమోషన్ లాంటి అసాధారణమైన మౌత్ టాక్ అలాగే సెంటిమెంట్‌లు ఉన్నాయి. దీనితో రాబోయే రోజుల్లో ఆడియన్స్ నుండి మూవీకి ఆదరణ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇక మార్వెల్ స్టూడియోస్ వారి బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్ మూవీ ప్రస్తుతం భారతదేశం అంతటా ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగులో థియేటర్లలో గ్రాండ్ గా ప్రదర్శితం అవుతుండడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు