భీమ్లా నాయక్: పవర్ ఫుల్ “డానియల్ శేఖర్” సెప్టెంబర్ 20 న వచ్చేస్తున్నాడు..!

Published on Sep 17, 2021 4:34 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఊర మాస్ లో కనిపించనున్నారు ఈ చిత్రం లో. ఈ చిత్రం నుండి విడుదల అయిన మేకింగ్ వీడియో మరియు భీమ్లా నాయక్ గ్లింప్స్ చూస్తే అది అర్దం అవుతుంది. అంతేకాక ఈ చిత్రం నుండి విడుదల అయిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అయితే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కి దీటుగా రానా దగ్గుపాటి పాత్ర ఉండనుంది. ఈ చిత్రం లో రానా డానియల్ శేఖర్ పాత్ర లో పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య న ఉండే సన్నివేశాలు సూపర్ గా ఉంటాయి అని సిని వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాక పవన్ కి దీటుగా రానా పెర్ఫార్మెన్స్ ఉంటుంది అని తెలుస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి రానా దగ్గుపాటి పాత్ర కి సంబంధించిన ఒక అప్డేట్ విడుదల అయింది. బ్లిట్జ్ ఆఫ్ డానియల్ శేఖర్ అంటూ సెప్టెంబర్ 20 వ తేదీన విడుదల కానుంది. ఈ వీడియో లో రానా దగ్గుపాటి నట విశ్వరూపం కనిపించనుంది. ఈ చిత్రానికి మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :