థాంక్యూ మీట్ కి ఏర్పాట్లు చేస్తున్న “బంగార్రాజు” టీమ్

Published on Jan 17, 2022 7:48 pm IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం ను జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సంయుక్తం గా నిర్మించడం జరిగింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ చిత్రం సంక్రాంతి పండుగ ను క్యాష్ చేసుకుంది అని చెప్పాలి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.

ఈ చిత్రం కి సూపర్ రెస్పాన్స్ వస్తుండటం పట్ల చుట్ట యూనిట్ ప్రేక్షకులకు థాంక్స్ తెలిపేందుకు ఏర్పాట్లు చేయడం మొదలెట్టింది. రేపు సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి లో మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్స్ లో బ్లాక్ బస్టర్ మీట్ ను నిర్వహించనుంది చిత్ర యూనిట్.

సంబంధిత సమాచారం :