కళ్యాణ్ రామ్ “అమిగోస్” ట్రైలర్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్!

Published on Feb 8, 2023 12:37 am IST


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ అమిగోస్. బింబిసార బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న చిత్రం కావడం తో ముందు నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ రాగా, ట్రైలర్ కి అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం ట్రైలర్ 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించి, యూ ట్యూబ్ లో దూసుకు పోతుంది. ట్రైలర్ ఆకట్టుకోవడం తో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం లో అశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 10, 2023 న విడుదల కానున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :