వెంకీమామ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ షూట్ షురూ.. రిలీజ్ కూడా ఖరారు

వెంకీమామ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ షూట్ షురూ.. రిలీజ్ కూడా ఖరారు

Published on Jul 11, 2024 12:10 PM IST


మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది అందరి ఫేవరెట్ విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. మరి మన తెలుగు ఆడియెన్స్ కి ఫరెవర్ వెంకీ మామగా నిలిచిపోయిన తాను ఇప్పుడు తాం బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి రీసెంట్ గా ఎక్స్ అంటూ అనౌన్స్ చేసిన ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ లు కూడా అందరిలో ఆసక్తి రేపాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ అవైటెడ్ కాంబినేషన్ ఎట్టకేలకు షూటింగ్ ని మొదలు పెట్టుకుంది. మరి ఆల్రెడీ వెంకీ మామ, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేసిన గత రెండు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవగా ఇప్పుడు ఈ హ్యాట్రిక్ తో కూడా మరో హిట్ కొట్టాలని చూస్తున్నారు.

అయితే మేకర్స్ ఇప్పుడు కొన్ని కీలక సన్నివేశాలతో షూటింగ్ ని మొదలై పెట్టగా ఈ సినిమా రిలీజ్ ఎపుడు అనేది కూడా లాక్ చేసేసారు. దీనితో ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో థ్రిల్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు