ఎవరు మీలో కోటీశ్వరులు: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కి సర్వం సిద్ధం!

Published on Dec 3, 2021 3:30 pm IST

బుల్లితెర పై ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ షో కి ఇప్పటి వరకూ చాలామంది సినీ ప్రముఖులు, సామాన్యులు వచ్చి తమ సత్తా చాటారు. ఈ కార్యక్రమంలో వినోదం తో పాటుగా విజ్ఞానం కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు యాజమాన్యం.

ఈ షో కి సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇది వరకే విడుదల అయ్యి చాలా ఆసక్తిని కలిగించింది. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ పై ప్రస్తుతం జెమిని టీవీ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. వీరిద్దరి బ్లాక్ బస్టర్ ఎపిసొడ్ ఈ ఆదివారం నాడు జెమిని టీవీ లో రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన సరికొత్త విడియో లో సూపర్ స్టార్ మహేష్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు నవ్వులు చిందిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు ఈ ఎపిసొడ్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :