బాలీవుడ్ కి చేరనున్న తెలుగులో సూపర్ హిట్ హర్రర్ కామెడీ

prema-katha-chitram
2013లో విడుదలైన ‘ప్రేమ కధా చిత్రమ్’ టాలీవుడ్ లో మంచి విజయం సాధించడమేకాక అనూహ్యమైన కలెక్షన్ లను సైతం సొంతంచేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్ళనుంది. ఈ విషయాన్ని స్వయంగా సూపర్ స్టార్ కృష్ణ గారే తన సిల్వర్ జుబ్లీ సందర్భంగా వెల్లడించారు. ఈ హిందీ రిమేక్ ని మారుతి దర్శకత్వం వహించనున్నాడు.

సుధీర్, నందిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ జె ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మారుతి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సంగతి తెలిసినదే. ఈ చిత్రం తమిళంలో సైతం రీమేక్ కావడం విశేషం. ఇప్పుడు ఈ హిందీ రీమేక్ ని సూపర్ స్టార్ తన సొంత బ్యానర్ అయిన పద్మాలయా స్టూడియోస్ ద్వారా నిర్మిస్తున్నారు.

Exit mobile version