నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన “డాకు మహారాజ్” బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 56 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. మొత్తానికి ఈ సంక్రాంతి సీజన్‌లో బాలకృష్ణ మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో.. రాబోయే రోజుల్లో ఇంకా సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
కాగా ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, బేబీ వేద అగర్వాల్ మరియు VTV గణేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో బాలయ్య పై యాక్షన్ సీక్వెన్స్ లను ఎఫెక్టివ్ గా డిజైన్ చేశారు. అదే విధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.