ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ ‘రాజు వెడ్స్ రాంబాయి’

Raju-weds-rambhai

రీసెంట్ గా మన తెలుగు సినిమా దగ్గర రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో ఒకటే రాజు వెడ్స్ రాంబాయి. నిజమైన సంఘటన ఆధారంగా దర్శకుడు సాయిలు కంపటి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. అయితే ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు ఈటీవీ విన్ వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అందులో నేటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ సినిమాని ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి ఒక బ్లాక్ బస్టర్ సంగీతం అందించగా స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ అన్నయ్య చైతు జొన్నలగడ్డ విలన్ రోల్ లో నటించారు. ఇక ఈ సినిమాకి వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవిలు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version