బాలయ్యకి విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ ఫిక్స్ ?

బాలయ్యకి విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ ఫిక్స్ ?

Published on Nov 7, 2022 1:00 PM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ ఉంది. ఆ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి, బాబీ డియోల్‌ తో ఆ పాత్రకు సంబంధించిన చర్చలు కూడా జరిపారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో నటించే నటీనటుల పై ఇప్పటికే చాలా రూమర్లు వినిపించాయి.

ఆ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల కూడా బాలయ్యకి కూతురిగా నటిస్తోందని టాక్ నడిచింది. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అన్నట్టు ఆల్ రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. షూటింగ్ ను కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు