ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన కెరీర్ 158వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తన బ్లాక్ బస్టర్ హిట్ వాల్తేరు వీరయ్య దర్శకుడు కొల్లి బాబీతో మళ్ళీ చేస్తున్న ఈ సినిమా పట్ల మంచి హైప్ అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ సినిమా విషయంలో గత కొన్ని రోజులుగా పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో టీం నుంచి వాటికి క్లారిటీ కూడా వచ్చింది.
ఇక ఇదే సమయంలో దర్శకుడు బాబీ మరో క్రేజీ అప్డేట్ ని కూడా అందించాడు. ప్రస్తుతం మెగాస్టార్ పై లుక్ టెస్ట్ జరుగుతున్నట్టుగా ఓ పిక్ ని షేర్ చేసుకొని చిరు స్వాగ్ పై దృష్టి పెట్టినట్టుగా ఇందులో కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ సినిమాలు పనులు ట్రాక్ లోనే ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు సిద్ధం చేస్తున్న లుక్ ఎలా ఉంటుందో కూడా వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తుండగా మిగతా డీటెయిల్స్ అతి త్వరలోనే ముందుకు రానున్నాయి.
Look test ☑️
Locked the look of #Mega158 with Megastar @KChiruTweets garu today 🤗
Can’t wait to begin this journey❤️🔥#ChiruBobby2 @KvnProductions @LohithNK01 pic.twitter.com/eWSLEqCqVN
— Bobby (@dirbobby) April 28, 2026
