హీరోయిన్ల సర్జరీలపై బోల్డ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !

Published on May 30, 2022 8:03 pm IST

హీరోయిన్ రాధికా ఆప్టే బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది. తాజాగా ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ల కాస్మొటిక్‌ సర్జరీలపై ఆమె కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ కామెంట్స్ ఏమిటో ఆమె మాటల్లోనే.. ‘నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నవారే. అవకాశాలు, పాపులారిటీని పెంచుకునేందుకు ముఖం, శరీరానికి సర్జరీలు చేసుకుంటున్నారు. వయసు కనిపించకుండా ఉండటానికే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. అదంతా నా వల్ల కాదు. అసలు నేను సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లను చూసి విసిగిపోయాను’ అంటూ రాధికా కామెంట్స్ చేసింది.

రాధికా ఆప్టే ఆ మధ్య ఓ బోల్డ్ వీడియోతో సంచలనం అయ్యింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పైగా ఆమెను డీసెంట్ లుక్స్ లో తెలుగు దర్శకులు చూపించారు. దాంతో తెలుగు వాళ్లల్లో ఆమె పై ఒక ఫ్యామిలీ ఇమేజ్ క్రియేట్ అయింది. అలాంటి డీసెంట్ హీరోయిన్ నుంచి బోల్డ్ గెటప్స్ చూసే సరికి మొదట అందరూ షాక్ అయ్యారు. దానికి తోడు రాధికా ఆప్టే ఇలా మధ్యమధ్యలో సరికొత్త బోల్డ్ కామెంట్స్ తో షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే ఉంది.

సంబంధిత సమాచారం :