టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ అలాగే యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం “హను మాన్” ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మన తెలుగు సినిమా నుంచి వచ్చిన మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా వచ్చి భారీ వసూళ్లు సహా లాభాలని కూడా అందించింది.
అయితే ఈ సినిమాలో తేజ సజ్జ తన లైఫ్ టైం పెర్ఫామెన్స్ ని పెట్టాడు అన్ని క్లైమాక్స్ పోర్షన్ చూస్తే అర్ధం అవుతుంది. స్పెషల్ గా తన పెర్ఫామెన్స్ కోసం బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ కొనియాడడం నాకు ఈ ఏడాదిలోనే బెస్ట్ కాంప్లిమెంట్ అన్ని తేజ సజ్జ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
హను మాన్ సినిమా చూసాక రణ్వీర్ సింగ్ నా పెర్ఫామెన్స్ కోసం ఎంతో మాట్లాడారని ప్రతీ చిన్న డీటెయిల్ ని కూడా వదలకుండా తాను అలా మాట్లాడ్డం ఎంతో ఆనందం కలిగించింది అని తేజ సజ్జ ఓ పోస్ట్ తో ఇద్దరూ కలిసి ఉన్న పిక్ ని షేర్ చేసి తెలిపాడు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి ఈ స్టార్ అండ్ వెర్సటైల్ బాలీవుడ్ నటుడు ప్రశాంత్ వర్మతో కూడా ఓ భారీ సినిమా చేయాల్సి ఉంది కానీ అది కాస్త వాయిదా పడింది. మంచి సమయం చూసుకొని ఈ బిగ్గెస్ట్ కలయిక మైత్రి మూవీ మేకర్స్ లో అనౌన్స్ కానుంది.