తలపతి 63 లో బాలీవుడ్ నటుడు !

ఇళయదళపతి విజయ్ – అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ‘తలపతి 63′(వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ చెన్నై లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈచిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తుండగా ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది.

భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు . తర్వలోనే ఈ చిత్రం యొక్క టైటిల్ ను ఖరారు చేయనున్నారు. దీపావళికి కానుకగా విడుదలకానున్న ఈ చిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు వున్నాయి.

Exit mobile version