బాలీవుడ్ స్టార్ హీరోకి సమంతతో నటించాలని ఉందట..!

Published on Sep 27, 2021 11:58 pm IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత గురుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో ఎప్పటికప్పుడు తనలోని కొత్త టాలెంట్‌ని నిరూపించుకుంటూ అందరిచేత ప్రశంసలు అందిపుచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సమంత యాక్టింగ్‌కి బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఫిదా అయ్యాడట. రాజ్‌-డీకే ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన పాపుల‌ర్ క్రైం థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ లో స‌మంత నెగెటివ్ పాత్ర‌లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా అభిమానులతో చాటింగ్ సెషన్‌లో పాల్గొన్న షాహిద్ క‌పూర్‌కు ఓ అభిమాని ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ గురించి అడిగాడు. దీనిపై షాహిద్ మాట్లాడుతూ ఫ్యామిలీ మ్యాన్ 2 నాకు చాలా బాగా నచ్చిందని, ఏదో ఒక‌సారి స‌మంతతో క‌లిసి నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు.

సంబంధిత సమాచారం :