ప్రియుడితో రహస్య వివాహం చేసుకున్న హీరోయిన్


బాలీవుడ్ తార రియా సేన్ వివాహ జీవితం లోకి అడుగు పెట్టింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియుడితో రియా సేన్ వివాహం జరిగింది. కేవలం కొందరు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఈ వివాహం రహస్యంగా జరిగింది. రియాసేన్ గర్భవతి కావడంతో వీరి వివాహం సడెన్ గా జరిగిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

రియాసేన్ గతంలో తెలుగు లో కూడా మెరిసింది. మంచు మనోజ్ సరసన నేను మీకు తెలుసా చిత్రంలో నటించింది. రియాసేన్ బాలీవుడ్ చిత్రాల ద్వారా బాగా ఫేమస్ అయింది.