‘సాహో’ సినిమాలో మరొక బాలీవుడ్ నటి !


‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ‘సాహో’ పై అన్ని పరిశ్రమల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు సినిమాను భారీ స్థాయిలో, అందరూ మెచ్చే విధంగా నిర్మించి ఒక జాతీయ స్థాయి ఔట్ ఫుట్ ను ప్రేక్షలకు అందించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ తారాగణంలో ఎక్కువ మందికి హిందీ నుండే తీసుకుంటున్నారు.

ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్ద కపూర్ ను తీసుకోగా ప్రతి నాయకులుగా నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను ఆనంద్ లను నిర్ణయించిన టీమ్ మరొక బాలీవుడ్ నటి మందిరా బేడీని కూడా ప్రాజెక్టులోకి తీసుకుంటున్నట్లు బీ-టౌన్ వర్గాల సమాచారం. మందిరా బేడీ కూడా నెగెటివ్ పాత్రలోనే కనిపిస్తుందని కూడా అంటున్నారు. అయితే ఈ విషయంపై ‘సాహో’ టీమ్ నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

సుమారు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకున్నారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.